ప్రజావాణికి 94 ఫిర్యాదులు: కలెక్టర్

ప్రజావాణికి 94 ఫిర్యాదులు: కలెక్టర్

NLG: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 94 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. వాటిలో 31 ఫిర్యాదులు జిల్లా అధికారులకు, 63 ఫిర్యాదులు రెవిన్యూ శాఖకు సంబంధించినవిగా గుర్తించారు. కలెక్టర్ త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, ఆర్డీవో అశోక్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.