రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

PLD: యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. మండలంలోని సొలస, మర్రిపాలెం గ్రామాలకు చెందిన ఇస్మాయిల్, రమేష్ బైక్‌పై వెళ్తూ, రోడ్డు దాటుతున్న సమయంలో గుంటూరు వైపు నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.