కొయ్యలగూడెంలో ఏసీబీ దాడులు
ELR: కొయ్యలగూడెం RWS కార్యాలయంపై ACB అధికారులు గురువారం ఆకస్మిక డాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏఈ, డీఈలను పట్టుకున్నారు. కాంట్రాక్టర్ వద్ద రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటుండగా అధికారులు వీరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ.75 లక్షల బిల్లుల మంజూరు కోసం లంచం డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ఫిర్యాదు చేసినట్లు ACB డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు.