కల్తీ ఆహారం.. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం.!
HYD: నగర వ్యాప్తంగా ఆహార కల్తీలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఈనెలలోనే జియాగూడ, అంబర్ పేట్, మంగళహాట్ ప్రాంతాల్లో భారీఎత్తున కల్తీ ఆహార పదార్థాలను అధికారులు గుర్తించారు. ప్రజలు కల్తీల పట్ల ఏమాత్రం అశ్రద్ధతో ఉన్నా.. ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. నగరంలో ఏటా 10 వేల డయేరియా కేసులు నమోదు అవుతుంటాయి. ఇందులో అధిక శాతం కల్తీ ఆహారం వల్ల కలిగినవే అని వైద్య నిపుణులు తెలిపారు.