VIDEO: గత ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాం: సబితా
RR: మీర్జాపూర్ వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటన స్థలానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేరుకున్నారు. గత BRS సమయంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టామని, భూసేకరణ పూర్తి చేసి టెండర్లకు పిలిచామన్నారు. ఎన్నికలు రావడం వల్ల పనులు ప్రారంభం కాలేదని, రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు.