నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KRNL: గూడూరు సబ్ డివిజన్ పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డిప్యూటీ ఈఈ జేసన్ ఒక ప్రకటనలో తెలిపారు. 33 కేవీ సి.బెళగల్ లైన్ మరమ్మతుల కారణంగా గూడూరు, కోడుమూరు, సి.బెళగల్ మండలాల్లోని పలు స్టేషన్లలో పనులు చేపడతామన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా గూడూరు,కోడుమూరు పట్టణాల్లో విద్యుత్ కోత ఉండనుందని పేర్కొన్నారు.