ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్

SKLM: ఇచ్చాపురం బహుదానది సమీపంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్‌ను అధికారులు ఆదివారం పట్టుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు రెవెన్యూ అధికారుల బృందం, ఆర్ఐ చిరంజీవి, వీఆర్వోలు తరకేస్, కృష్ణ, శంకర్ ఘటనా స్థలాన్ని చేరుకుని ట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనధికార తవ్వకాలు, అక్రమ రవాణా చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.