తెలుగు వర్సిటీ.. ఎల్లుండి నుంచి క్రీడా పండుగ

తెలుగు వర్సిటీ.. ఎల్లుండి నుంచి క్రీడా పండుగ

HYD: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్సిటీలో బోధన, బోధనేతర, విద్యార్థులకు ఈనెల 17 నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం వర్సిటీ VC ఆచార్య నిత్యానందరావు, రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు క్రీడా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. వర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. స్పోర్ట్స్ కో- ఆర్డినేటర్ R.గోపాల్ పాల్గొన్నారు.