స్వాతంత్య్ర సమరయోధుడు కన్నుమూత

స్వాతంత్య్ర  సమరయోధుడు కన్నుమూత

SRD: సదాశివపేట పట్టణంలో స్వాతంత్య్ర సమరయోధుడు మునిపల్లి రామచంద్రయ్య సోమవారం రాత్రి కన్నుమూశారు. దీంతో పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్వాతంత్య్ర పోరాట సమరంలో పాల్గొన్న ఆయన ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఈయన మృతి తీరని లోటు అని పలువురు నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు. నేడు మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగనున్నాయి.