అనారోగ్యంతో నాయి బ్రాహ్మణుడు మృతి
MHBD: డోర్నకల్ పట్టణానికి చెందిన సెలూన్ షాప్ యజమాని ఆవుదుర్తి సైదులు అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. ఆయన మృతిపట్ల పట్టణంలోని నాయి బ్రాహ్మణుల సంఘం సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉదయం ఆయన నివాసానికి వెళ్లి, మృతదేహానికి పూలమాలతో నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.