'కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి'

KDP: కమలాపురం పంచాయతీ పరిధిలో బస్టాండ్ సమీప డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ ప్రహల్లాద్ సోమవారం పరిశీలించారు. ఆయన పారిశుద్ధ్య కార్మికులకు ఎప్పటికప్పుడు కాలువలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. చెత్త పేరుకుపోతే మురికి నీరు రోడ్లపైకి వచ్చి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తుందని నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశుభ్రత తీసుకోవాలని సూచించారు.