కడపలో ‘స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమం
కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లాలో “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత ప్రయాణించే లారీ, బస్సు, కారు డ్రైవర్లను ఆపి నీళ్లతో ముఖం కడిగించి అలసట తగ్గించి సురక్షితంగా ప్రయాణించాలంటూ పోలీసులు సూచనలు ఇస్తున్నారు.