జగన్ పాలనలో సర్పంచ్‌ల బిక్షాటన చేశారు: మంత్రి

జగన్ పాలనలో సర్పంచ్‌ల బిక్షాటన చేశారు: మంత్రి

W.G: జగన్ పాలనలో పంచాయతీల్లో సిబ్బందికి జీతాలు ఇవ్వలేక సర్పంచ్‌ల బిక్షాటన చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం పాలకొల్లు మండలం వడ్లవానిపాలెంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ 5 ఏళ్లు పరిపాలించి రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారని, పంచాయతీల్లో చిల్లి గవ్వ లేకుండా చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని విమర్శించారు.