శివాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
KNR: కరీంనగర్ నగరంలోని 33వ డివిజన్ భగత్‌నగర్ శివాలయంలో ఇవాళ ఉదయం నుంచి కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దసంఖ్యలో చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. “ఓం నమః శివాయ” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది.