'మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి'
AKP: మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి ఎం.వెంకట అప్పారావు సూచించారు. మంగళవారం మునగపాక జడ్పీ హైస్కూల్లో నిర్వహించిన చెక్కుముకి టాలెంట్ టెస్ట్‌లో పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు విజ్ఞానాన్ని కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో HM శ్రీనివాసరావు పాల్గొన్నారు.