ఎరువులు అమ్ముతున్న వ్యక్తిపై కేసు

AKP: తట్టబంద సాయినగర్లో ఎటువంటి లైసెన్స్ లేకుండా అనధికారంగా ఎరువులు అమ్ముతున్న కే.అప్పారావుపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. SSP 42 బస్తాలు, SSP పౌడర్ 9 బస్తాలు, యురియా 18 బస్తాలు, నిషేధించిన 17-17-17 రసాయనక ఎరువు 25 బస్తాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలకై రావికమతం తహసీల్దారుకు పంపామని విజిలెన్స్ ఎస్సై రవికుమార్ తెలిపారు.