జర్నలిస్టుల పట్ల ఎస్సై లెనిన్ దాతృత్వం

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఎస్సై లెనిన్ జర్నలిస్టుల పట్ల దాతృత్వం చాటారు. జర్నలిస్టులకు స్వెటర్లు పంపిణీ చేసి మాట్లాడుతూ.. జర్నలిస్టులు వార్త సేకరణలో వివిధ ప్రాంతాలకు వెళ్లినప్పుడు వర్షంలో తడిసి అనారోగ్యానికి గురి కాకుండా స్వెటర్లు పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎస్సైకి ధన్యవాదాలు తెలిపారు.