హామీలు అమలు చేయాలని దీక్ష
NGKL: అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఇవాళ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మొదటి రోజు దీక్షలలో పలువురు డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు.