కొత్తపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి బలవంత్ రెడ్డి ఏకగ్రీవం
RR: శంకర్‌పల్లి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బలవంత్ రెడ్డి సర్పంచ్‌గా శుక్రవారం ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుచారి బరిలో ఉండగా సాయంత్రం విత్ డ్రా చేసుకున్నారు. దీంతో బలవంత్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవం అయింది. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బలవంత్ రెడ్డి చెప్పారు. మండలంలో ఏకగ్రీవ సర్పంచ్‌గా కొత్తపల్లి రెండో గ్రామంగా నిలిచింది.