VIDEO: రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయిన మంత్రి
RR: శంషాబాద్ సమీపంలోని పెద్ద షాపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇంటర్ పరీక్ష రాసేందుకు వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో యువకులు మృతి చెందారు. అటువైపుగా వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి తన వాహనాన్ని ఆపి రోడ్డు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మరణించిన విద్యార్థులను చూసి ఆయన చలించిపోయారు.