'పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలి'

'పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలి'

మంచిర్యాల: వేమనపల్లి మండలం బద్దంపల్లి గ్రామంలోని ఆదివాసి గిరిజన బలహీన వర్గాల రైతులకు చెందిన పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండు బానేష్ అన్నారు. పట్టా పాస్ పుస్తకాలు లేనందున రైతు భరోసా, నష్టపరిహారం పొందులేక రైతులు అప్పుల పాలవుతున్నారని, ప్రభుత్వం శ్రద్ధ వహించి పట్టాలు ఇప్పించాలని, లేకపోతే నిరసనలు తెలుపుతామన్నారు.