క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన ప్రార్థనా మందిరాలు

క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన ప్రార్థనా మందిరాలు

కర్నూలు: ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినం పురస్కరించుకుని తుగ్గలిలోని సీయోను ప్రార్థన మందిరం బుధవారం విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గురువారం నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని పలు గ్రామాల్లోని చర్చిలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.