ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

MNCL: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గత రాత్రి నుంచి వర్షం పడుతుండడంతో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరింది. శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రిలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో యంత్రాలు ఎక్కడిక్కడే నిలిచిపోయి మట్టి, బొగ్గు వెలికితీత పనులకు విఘాతం కలిగింది.