హీరోయిన్‌గా 'మిస్ యూనివర్స్ ఇండియా'
'మిస్ యూనివర్స్ ఇండియా- 2024' టైటిల్ విజేత రియా సింఘా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. 'మత్తు వదలరా' ఫేమ్ రితేశ్ రాణా తెరకెక్కిస్తున్న 'జెట్లీ' చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. రియా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె యాక్షన్ పాత్రను పోషించనున్నట్లు తెలుస్తోంది.