సిసి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
SRD: సీసీ రోడ్డుల నిర్మాణం ద్వారా స్థానిక ప్రాంతాల్లో ప్రయాణ సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజీ కాలనీలో రూ. 98 లక్షల 50 వేల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.