'ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరాలి'

BHNG: స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని, BJP యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా BJP ఆధ్వర్యంలో ఆలేరులోని రైల్వే గేట్ నుండి బస్టాండ్ వరకు జాతీయ జెండాలతో గురువారం ర్యాలీ నిర్వహించారు.