మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన DM
KMR: మాచరెడ్డి మండలంలోని సోమారంపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్ రెడ్డి ఇవాళ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు తీసుకొచ్చిన మొక్కజొన్న తేమశాతం పరిశీలించిన తర్వాత నాణ్యతా ప్రమాణాలను పాటించి తూకం వేయాలని సిబ్బందికి సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరగతిన కొనుగోలు చేయాలన్నారు.