మహిళా సంఘాలకు స్త్రీనిధి రుణాలు రెట్టింపు

మహిళా సంఘాలకు స్త్రీనిధి రుణాలు రెట్టింపు

అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో కూటమి ప్రభుత్వం మహిళా సంఘాలకు స్త్రీనిధి రుణాలు రెట్టింపు చేసినట్లు వెలుగు ఏజీఎం సంతోష్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న లక్ష్యంతో స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేస్తోందన్నారు. గతంలో రూ. 5 లక్షల వరకు ఇచ్చేవారు. ఈ ఏడాది నుంచి ఒక్కో సంఘానికి రూ.8 లక్షలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.