VIDEO: జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు
నిర్మల్ పట్టణంలో వంట గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే ఏజెన్సీల వద్ద క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ ఉన్నవారికే సిలిండర్లు ఇస్తున్నప్పటికీ, హోం డెలివరీ ఆలస్యమవుతుండటంతో వినియోగదారులు స్వయంగా ఏజెన్సీలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఇవాళ వినియోగదారులు హిట్ టీవీతో తెలిపారు.