స్థానిక ఎన్నికలపై నేడు CM రేవంత్ సమీక్ష

స్థానిక ఎన్నికలపై నేడు CM రేవంత్ సమీక్ష

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పొన్నం, ఉత్తమ్, సీతక్క, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సమావేశంలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై చర్చించనున్నారు.