ప్రకాశం బ్యారేజీ వరదపై సీఎం సమీక్ష

NTR: అమరావతిలో బుధవారం సీఎం చంద్రబాబు భారీ వర్షాలపై మంత్రులు, సీఎస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో వర్షాలు పడతాయని, కృష్ణా నదిలో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహానికి అవకాశం ఉందని, అప్రమత్త చర్యలకు ఆదేశాలు జారీచేశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 3.09 లక్షల క్యూసెక్కులు విడుదలవుతున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.