చేతిలో హెల్మెట్.. ప్రమాదం జరిగితే ప్రాణాలు పోతాయ్

మేడ్చల్: ప్రయాణంలో మనల్ని రక్షించే హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ పలువురు తీరు మారటం లేదు. స్కూటీ, బైకులపై కూర్చుని హెల్మెట్ చేతిలో పట్టుకుని, బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై పెట్టుకుని నిర్లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నారు. ఇలా హెల్మెట్ పెట్టుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదంలో ప్రాణాలే పోతాయని మేడ్చల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.