గుండెపోటుతో యువకుడు మృతి
ATP: గుత్తిలోని బండగేరికి చెందిన శ్రీనివాసులు శనివారం గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఇంట్లో ఉన్న సమయంలో ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.శ్రీనివాసులు మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.