దర్గా ఉత్సవాల్లో యువకుడు దారుణ హత్య

దర్గా ఉత్సవాల్లో యువకుడు దారుణ హత్య

కడప జిల్లా అమీన్‌పూర్ దర్గా ఉరుసు ఉత్సవాల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టినరోజుకు కొన్ని గంటల ముందే అబూబక్కర్ సిద్ధిఖీని అతని స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారు. ఈ మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గంజాయి లావాదేవీ లేదా యువతి వ్యవహారం కారణమై ఘర్షణ జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.