గన్నవరం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
కృష్ణా: గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బూతులు తిట్టే నాయకుల కోసం చట్టం తీసుకురావాలన్నారు. YCPలో ఉన్నప్పుడు ఆ నాయకులు మాట్లాడుతున్న బూతులను ఖండించిన ఏకైక నాయకుడు తానేనని చెప్పారు.YCP నాయకులు బూతులు మాట్లాడుతున్నప్పుడు జగన్ ఖండించాలని తాను సూచించినట్లు వివరించారు. YCPకి తాను అన్నం పెడితే సున్నం పెట్టారని వాపోయారు.