'అధైర్యపడవద్దు విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం'
SRCL: విద్యుత్ వినియోగదారుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. తంగళ్ళపల్లి మండలం గండిలచ్చపేటలో వరదలలో కొట్టుకుపోయినా విద్యుత్ స్తంభాలను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రజలు ఎవరు అధైర్యపడవద్దని సాధ్యమైనంత త్వరగా సమస్యలు పరిష్కరించి విద్యుత్ పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.