VIDEO: స్కూల్ బస్ డ్రైవర్లకు రోడ్ సేఫ్టీపై అవగాహన సదస్సు

KRNL: కర్నూలు రేంజ్ డీఐజి కోయ ప్రవీణ్ మార్గనిర్దేశనలో నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ సూచనలతో రోడ్ సేఫ్టీపై స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు నంద్యాల ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో 150 మంది స్కూల్ వ్యాన్ బస్సుల డ్రైవర్లకు అవగాహన కల్పించారు.