తెలుగు పాట ఉన్నంత కాలం.. ఘంటసాల అమరమే!
తెలుగు పాట ఉన్నంత కాలం అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆ గాన గంధర్వుడి జయంతి నేడు. తన గాత్రంతో తెలుగు చలనచిత్ర సంగీతానికి స్వర్ణయుగాన్ని అందించిన మహనీయుడు ఆయన. పద్యమైనా, పాటైనా, భగవద్గీత శ్లోకమైనా.. ఆయన గొంతుతో పలికితే అదో అద్భుతం. భౌతికంగా మన మధ్య లేకపోయినా తన పాటల ద్వారా నిత్యం మనతోనే జీవించి ఉన్న ఘంటసాలకు ఘన నివాళి.