నాకే ఓటేశారా? ప్రమాణం చేయండి: MLA వదిన

నాకే ఓటేశారా? ప్రమాణం చేయండి: MLA వదిన

TG: తొలివిడత సర్పంచ్ ఎన్నికలలో ఓడినా కూడా అభ్యర్థులు ప్రజల ఇళ్లకు వెళ్తున్నారు. అయితే ఈ సారి ఓట్ల కోసం కాదు, ఓటేశారో లేదో అడగడం కోసం. మహబూబాబాద్ MLA మురళీనాయక్ వదిన కౌసల్య కూడా నిన్న సోమ్లాతండాలో పోటీ చేసి ఓడటంతో ఇవాళ జనం ఇంటిబాట పట్టారు. 'ఓటేశామని ప్రమాణం చేయండి లేదా డబ్బులు తిరిగి ఇచ్చేయండి' అని డిమాండ్ చేస్తున్నారు. ఓడిన పలువురు అభ్యర్థులు కూడా ఇదే చేస్తుండటం గమనార్హం.