VIDEO: రౌడీయిజంపై ఉక్కు పాదం: ఎస్పీ
నెల్లూరు జిల్లా పోలీసులు రౌడీయిజంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజా నాట్యమండలి కళాకారుడు పెంచలయ్య హత్య కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం సాయంత్రం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీలు జైల్లోనే ఉండాలని స్పష్టం చేశారు.