ఇజ్రాయెల్, USకు ఇరాన్ అధ్యక్షుడి వార్నింగ్
ఇజ్రాయెల్, USకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తాము చేస్తున్న ప్రతీకార దాడులు పూర్తిగా చట్టబద్ధమైనవని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడులతో శత్రువులను గట్టిగా దెబ్బతీస్తామని, ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికాకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తమ దేశ సార్వభౌమాధికారం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధమని ఇరాన్ ప్రెసిడెంట్ వెల్లడించారు.