ఇసుక తరలింపుతో.. రోడ్లు ధ్వంసం
WGL: వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామంలో ఆకేరు వాగు పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక ట్రాక్టర్లు తరలించడంతో గ్రామ రోడ్లు గుంతలమయంగా మారాయి. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేసినా స్పందన లేకపోవడంతో గ్రామానికి చెందిన గీత కార్మికుడు శనివారం బూడిద అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు.