'సర్పంచి'కి.. 174 నామినేషన్లు
NZB: జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ల స్వీకరణ బుధవారం మొదలైంది. ఆలూరు, ఆర్మూరు, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట, వేల్పూర్, ఏర్గట్ల మండలాలకు ఈ నెల 17న ఎన్నిక జరగనుంది. ఈ మేరకు మండల్లలోని 165 సర్పంచ్ స్థానాలకు 174 నామినేషన్లు, 1,620 వార్డు స్థానాలకు 405 నామపత్రాలు దాఖలయ్యాయి. గడువు రేపటి (శుక్రవారం)తో ముగియనుంది.