'తీసుకున్న రుణాలను సక్రమంగా వినియోగించుకోవాలి'
SKLM: మహిళా సంఘ సభ్యులు తీసుకున్న రుణాలను సక్రమముగా వినియోగించుకుని ఎంటర్‌ప్రీన్యూర్‌గా తయారు కావాలని మందస వెలుగు పీవో పైడి కూర్మా రావు అన్నారు. మంగళవారం కుసుమల, దేవ్ పురం గ్రామాలలో గ్రామ సంఘ మహిళలుతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వము మహిళాభివృద్దికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించారు.