గురుకులం ప్రవేశ పరీక్ష వాయిదా

SKLM: ఎచ్చెర్ల మండలంలోని దుప్పలవలస అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఐదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి ఈ నెల 6న జరగాల్సిన పరీక్ష వాయిదా పడినట్లు ప్రిన్సిపల్ బోర బుచ్చిరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ నెల 13న పరీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు.