మిస్‌ యూనివర్స్ పోటీ.. అందాల భామల వాకౌట్

మిస్‌ యూనివర్స్ పోటీ..  అందాల భామల వాకౌట్

థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న 74వ మిస్ యూనివర్స్ పోటీల్లో గందరగోళం ఏర్పడింది. మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ నేషనల్ డైరెక్టర్ నవాత్.. మిస్ మెక్సికో ఫాతిమా బోష్ మధ్య వాగ్వాదం జరిగింది. ఒక షూట్‌కు హాజరుకాలేదని ఫాతిమాను నవాత్ బహిరంగంగా ప్రశ్నించారు. దీంతో ఆమెతోపాటు పలువురు పోటీదారులు వేదిక నుంచి వాకౌట్ చేశారు.