ఖతార్‌లో ఇజ్రాయెల్ అనూహ్య దాడి

హమాస్ నాయకత్వమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఖతార్‌లో దాడి చేసింది. దీంతో ఆ దేశ రాజధాని దోహాలో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడి ఎలా జరిగింది? ఎంతమంది చనిపోయారు? తదితర వివరాలు మాత్రం తెలియరాలేదు. అయితే ఈ దాడిపై పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.