రేపు భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొననున్న ఎమ్మెల్యే

రేపు భూ భారతి అవగాహన సదస్సులో పాల్గొననున్న ఎమ్మెల్యే

NRPT: ధన్వాడ మండల కేంద్రంలో బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే భూ భారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరహరి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు భూ భారతి చట్టం నిబంధనలపై అవగాహన సదస్సు ఉంటుందని అన్నారు. సదస్సులో రైతులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.