విద్యార్థులకు చట్టాలపై అవగాహన
ELR: విద్యార్థులు ఇష్టంతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషా అన్నారు. గురువారం భీమడోలు హైస్కూలు విద్యార్థులకు బాల్యవివాహాలు, సైబర్ నేరాలు, గుడ్ టచ్ -బ్యాడ్ టచ్, పోక్సోచట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.