నేడు వరంగల్ తూర్పులో మంత్రి పర్యటన

WGL: మంత్రి కొండా సురేఖ శనివారం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పాతబస్తీలోని 32వ డివిజన్ బీఆర్నగర్, 42వ డివిజన్ రంగశాయిపేట పీహెచ్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన, అనంతరం 28వ డివిజన్‌లో పలు నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కరీమాబాద్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో మంత్రి సురేఖ ప్రసంగించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.